ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఇవ్వడానికి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏపీలోని నిరుద్యోగులకు కౌశలం అనే కార్యక్రమం ద్వారా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలను నిర్వహిస్తోంది. సర్వేలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారి విద్యార్హత ప్రతిభను బట్టి ఈనెల 8వ తేదీ వరకు కౌశలం పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు.